మరింత ఆలస్యం కానున్న ‘గాడ్ ఆఫ్ వార్’..?

‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. వీరు కలసి చేయనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సుబ్రహ్మణ్య స్వామి కథల ఆధారంగా ఒక పౌరాణిక యాక్షన్ ఎపిక్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ యోధుడి పాత్రలో కనిపించనున్నాడట.

ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను 2027 మార్చి తర్వాత ప్రారంభించి, అదే సంవత్సరం సెకండ్ హాఫ్ లో షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇటీవల జరిగిన భుజం గాయం నుండి కోలుకుంటున్నాడు. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్న ఆయన, పూర్తిగా కోలుకున్న వెంటనే తన తదుపరి చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్‌ను పునఃప్రారంభిస్తాడు.

ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ కోసం పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version