ఓటిటి సమీక్ష: ‘వదంది – సీజన్ 2’ – క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో

ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో

ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : ఆగస్టు 07, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ 2.25/5

నటీనటులు : M. శశికుమార్, యశ్వంత్, అనఘ, అపర్ణా దాస్, రేవతి శర్మ, వివేక్ ప్రసన్న
దర్శకత్వం : ఆండ్రూ లూయిస్
నిర్మాతలు : పుష్కర్, గాయత్రి
సంగీతం : సైమన్ కే కింగ్
ఛాయాగ్రహణం : శరవణన్ రామస్వామి
కూర్పు : రిచర్డ్ కెవిన్ ఏ

సంబంధిత లింక్స్ : ట్రైలర్

పాపులర్ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిట్ అయ్యిన పలు వెబ్ సిరీస్ లలో ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘వదంది’ కూడా ఒకటి. కొన్నేళ్ల కితం రిలీజ్ అయ్యిన ఈ సిరీస్ కి సీక్వెల్ ని ఇపుడు మేకర్స్ కొత్త తారాగణంతో తీసుకొచ్చారు. మరి ఈ సీజన్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తమిళనాడు పదంబత్తుర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా మూసా రజా (శశికుమార్) పని చేస్తూ ఉంటారు. తన పని విషయంలో నిజాయితీగా ఉండే తనకి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓ హై వే ప్రాజెక్ట్ ని ఆరంభించే సమయంలో జరిపిన మొదటి తవ్వకంలోనే ఒక అస్థిపంజరం బయటపడి అందరికీ షాకిస్తుంది. దీంతో ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఈ క్రమంలో ఎస్పీ రతికా నైర్ (అనఘా) ఈ కేసుని మూసాపై నమ్మకంతో అప్పగిస్తుంది. ఇక ఇక్కడ నుంచి ఈ కేసు లోతుకి వెళుతున్న కొద్దీ వారికి మరిన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇందులో జల్లికట్టు ఆడే సాధారణ కుర్రాడు మడకతన్ మణి (యశ్వంత్) ఎలా ఇరుక్కున్నాడు? ఇంతకీ ఆ అస్థిపంజరం ఎవరిది? దీని వెనుక ఉన్న నేరస్థుడు ఎవరు? తనని పట్టుకున్నారా లేదా అనేవి ఇందులో మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈసారి సీజన్ లో కూడా సెటప్ అంతా డీప్ గా వెళ్లే కొద్దీ కొత్త కొత్త అంశాలతో అక్కడక్కడా థ్రిల్ చేసే విధంగానే కొనసాగుతుంది. ఎపిసోడ్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే మెయిన్ ప్లాట్ లోకి కథనం వెళుతుంది. అలా ఒకో ఎపిసోడ్ కి ఇచ్చే ఎండింగ్ లు మధ్య మధ్యలో కొన్ని ట్విస్ట్ లు మాత్రం డీసెంట్ గానే ఉన్నాయి.

ఇలా ఏడవ ఎపిసోడ్ ఎండింగ్ వరకు మధ్యలో ప్లాన్ చేసుకున్న కథనం, పాత్రలు, వాటి డెవలప్మెంట్ అలా కొనసాగుతున్న కొద్దీ లోతు బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. ఇక నటీనటుల్లో శశి కుమార్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా బాగా చేశారు. తనతో పాటుగా అనఘా కూడా మంచి పెర్ఫామెన్స్ కనబరిచారు.

వారితో పాటుగా యువ నటీనటులు మాత్రం బాగా చేశారు. యశ్వంత్, రేవతి శర్మలు ప్రేమికులుగా మంచి కెమిస్ట్రీ చూపించారు. అలాగే అపర్ణ దాస్ కూడా తన రోల్ లో బాగా చేసింది. ఇతర నటీనటులు కూడా బాగానే చేశారు.

మైనస్ పాయింట్స్:

ఖచ్చితంగా వదంది సీజన్ 1 రేంజ్ ఆశలు దీనిపై పెట్టుకుంటే మాత్రం వారికి ఈ సీజన్ నిరాశనే మిగులుస్తుంది. మెయిన్ గా ఆరంభంలో కొన్ని ఎపిసోడ్స్ అందులో పరిస్థితులు ప్లాన్ చేసుకోవడం బాగానే అనిపిస్తుంది కానీ ఈ క్రమంలో పెట్టిన సాగదీత మాత్రం చూసే ఆడియెన్ సహనాన్ని పరీక్షించక మానదు.

దీనితో ఈ 8 ఎపిసోడ్స్ ఉన్న సీజన్ చాలా భారంగా వెళుతున్నట్టు ఫీల్ కలుగుతుంది. ఎంత ఒక్కసారే మొత్తం చూసేద్దామన్నా చివరికి వచ్చేసరికి కథనంలో ఇచ్చే సిల్లీ ట్విస్ట్ లు చూసి మొదట నడిపించిన కథనాన్ని అంతటినీ తేలిపోయేలా చేస్తాయి. ఒక సీరియస్ టోన్ లో మొదలైన ఈ సీజన్ నెమ్మదిగా పేలవంగా మారిపోతుంది.

ముందు అంతా స్లోగా నడిపించినప్పటికీ అక్కడక్కడా ట్విస్ట్ లు ఇన్వెస్టిగేషన్ సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి కానీ అప్పుడు వరకు చేసిన ఆ ఇన్వెస్టిగేషన్ అంతటినీ సింపుల్ గా ఒక ‘హ్యూమన్ ఎర్రర్’ తేల్చి పారేయడం అన్ని వర్గాల ఆడియెన్స్ కి రుచించకపోవచ్చు. అలానే సిరీస్ ని ఒక రొటీన్ ఎండింగ్ తో ముగించేయడం మరో మైనస్ గా ఇందులో కనిపిస్తుంది.

ఇలా చివరి రెండు ఎపిసోడ్స్ ముందు ఓకే అనిపించే రేంజ్ లో ఉన్నాయి అనుకునే వాటిపై కూడా ఉన్న ఇంప్రెషన్ ని పోగొట్టేలా చేస్తాయి. అలానే ఇందులో మతపరమైన అంశాలను కూడా ఇరికించినట్టుగా అనిపిస్తుంది. వీటితో పాటుగా ఆ లవ్ ట్రాక్ లను కూడా తగ్గించి మరింత గ్రిప్పింగ్ గా సిరీస్ ని మలచి ఉంటే మరికొంత బెటర్ ఫీల్స్ ని కలిగించి ఉండొచ్చు.

సాంకేతిక విభాగం:

ఈ సీజన్ లో కూడా సెటప్ అంతా నీట్ గానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం బాగానే ఉంది. కెమెరా వర్క్ కూడా డీసెంట్ అని చెప్పొచ్చు. కొన్ని చోట్ల వి ఎఫ్ ఎక్స్ సీన్స్ వీక్ గా ఉన్నాయి. ఎడిటింగ్ మాత్రం ఇంకా బెటర్ గా ఉండాల్సింది. పాటలు, లవ్ ట్రాక్ లు ఇంకా కొన్ని సీన్స్ ని తగ్గించి గ్రిప్పింగ్ గా మలచాల్సింది. తెలుగు డబ్బింగ్ బాగుంది.

ఇక దర్శకుడు ఆండ్రూ లూయిస్ విషయానికి వస్తే.. తన వర్క్ మొదటి కొన్ని ఎపిసోడ్స్ వరకు బాగానే క్లారిటీ గానే కనిపిస్తుంది కానీ చాలా సాగదీతగా ఎపిసోడ్స్ ని ప్లాన్ చేసుకున్నారు. అలాగే చివరి ఎపిసోడ్స్ లో మాత్రం సీరియస్ నెస్ మిస్సయ్యింది. దీనితో టోటల్ సీజన్ కే మిస్ ఫైర్ అయ్యినట్టు ముగుస్తుంది. సో తన వర్క్ మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేదు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘వదంది సీజన్ 2’ ఒక బోరింగ్ క్రైమ్ థ్రిల్లర్ గా మిగిలిపోయింది. మొదటి కొన్ని ఎపిసోడ్స్ లో కొంచెం ల్యాగ్ ఉన్నప్పటికీ డీటైలింగ్, కథనం పర్వాలేదు అనిపిస్తాయి. కానీ తర్వాత నుంచి కథనం పక్కదారి పడుతుంది. ముఖ్యంగా చివరి రెండు ఎపిసోడ్స్ లో ఆడియెన్స్ దృక్కోణాన్ని పూర్తిగా పక్కదారి పట్టించే విధంగా చేసిన ప్రయత్నం మిస్ ఫైర్ అయ్యింది. సో మీ టైం సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ సీజన్ కి దూరంగా ఉంటేనే బెటర్.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Exit mobile version