ఫోటో మూమెంట్: తన ‘పుష్ప’ రాజ్ ప్రతిమతో తగ్గేదేలే అంటున్న ‘రాకా’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన ట్రిపుల్ ఏ మల్టీప్లెక్స్ ని హైదరాబాద్ నుంచి విశాఖకు విస్తరించిన సంగతి తెలిసిందే. తన సూపర్ హిట్ చిత్రం, అది కూడా వైజాగ్ నేపథ్యంలోనే తెరకెక్కిన ‘జులాయి’ విడుదల అయ్యిన రిలీజ్ డేట్ లోనే తన మల్టీప్లెక్స్ ని తాను లాంచ్ చేయడం మరో ఆసక్తికర యాదృచ్చికంగా మారింది. ఇక అక్కడ నుంచి కొన్ని బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ని ఐకాన్ స్టార్ షేర్ చేయడం ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి.

అయితే వాటిలో ఒక్క ఫోటో మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ స్థాపించిన అల్లు అర్జున్ పుష్ప రాజ్ ప్రతిమ ‘తగ్గేదేలే’ మ్యానరిజం చేస్తూ కనిపిస్తుంది. అయితే దీనితోనే పక్కన ఉన్న బన్నీ అదే మ్యానరిజం చేయడం ఫ్యాన్స్ లో క్రేజీగా మారింది. పైగా రాకా లుక్ లో ఈ మ్యానరిజం చేయడంతో బెస్ట్ మూమెంట్ గా కూడా నిలిచి వైరల్ గా మారింది. ఇక ఇక్కడ నుంచి నేరుగా బన్నీ రాకా సెట్స్ కి పయనం కానున్నారు.

Exit mobile version