‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట విడుదల

Dharmasthala Niyojakavargam

‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సంయుక్తంగా విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాటను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

దర్శకుడు క్రిష్, గీత రచయిత చంద్రబోస్ తమ చిత్ర పాటకు మద్దతుగా నిలవడం ఆనందంగా ఉందని దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట పేర్కొన్నారు. కథానుగుణంగా వచ్చిన ఈ గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఆయన తెలిపారు.

మూవింగ్ డ్రీమ్స్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహావీర్ యేలెంధర్ సంగీతం అందించగా, సాయి చరణ్ ఆలపించారు. వెంకట హనుమ సినిమాటోగ్రఫీ, సాయిబాబు తలారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రంలో నటరాజ, సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, వరుణ్ సందేశ్, వితిక షేరు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version