బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తీస్తున్న సినిమా ‘రామాయణ’. భారీ విజువల్ స్కేల్ ఉన్న సినిమా, పైగా భారతీయ సినిమాల్లోనే అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా, రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, యశ్ రావణుడిగా రాబోతున్న సినిమా. ఐతే, ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ కు సంబంధించిన వార్తలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ‘రామాయణ’ క్లైమాక్స్‌ను భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట.
ముఖ్యంగా కథలోని కీలక భావోద్వేగాలు, అడ్వెంచర్ అంశాలు, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ఈ క్లైమాక్స్‌లోనే పరాకాష్టకు చేరుకునేలా రామాయణ మేకర్స్ ప్లాన్ చేశారట. ముఖ్యంగా సముద్రపు మంచు పర్వతాలు, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించేలా క్లైమాక్స్ చిత్రీకరణ ఉంటుందట. ఏది ఏమైనా మొత్తానికి సినీప్రియులందరి దృష్టి కూడా ప్రస్తుతం ‘రామాయణ’ మీదే ఉంది.
కాగా బాలీవుడ్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
