‘అగధ’లో హీరోగా, యాంటీ హీరోగా మెప్పించిన శ్రవణ్ రెడ్డి

Shravan Reddy

‘అగధ’ రెగ్యులర్ హారర్ చిత్రాలకు భిన్నమైన సినిమా. కేవలం భయపెట్టే అంశాలకే పరిమితం కాకుండా మిస్టిసిజం, సూపర్‌నేచురల్ అంశాలతో కూడిన విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నటీనటుల ప్రతిభ ఈ కథనానికి మరింత బలాన్ని చేకూర్చింది.

ఇందులో శ్రవణ్ రెడ్డి పోషించిన పాత్రలో ఎన్నో కోణాలు కనిపిస్తాయి. కథ ప్రారంభంలో చాలా సాధారణ వ్యక్తిలా కనిపించే ఆ క్యారెక్టర్, కథనం ముందుకు సాగే కొద్దీ అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఈ మార్పులను శ్రవణ్ తన పరిణతితో కూడిన నటనతో తెరపై సహజంగా పండించారు. పాత్ర తీరుతెన్నులపై ప్రేక్షకుల్లో నిరంతరం ఉత్కంఠ కొనసాగేలా చేయడంలో ఆయన నటన కీలక పాత్ర పోషించింది.

పాజిటివ్, నెగటివ్ షేడ్స్ రెండింటినీ సమతుల్యం చేస్తూ శ్రవణ్ కనబరిచిన నటన ప్రశంసలు అందుకుంటోంది. సంభాషణలు లేని నిశ్శబ్ద సన్నివేశాల్లో సైతం తన ముఖ కవళికలతో పాత్రలోని గంభీరతను చక్కగా నిలబెట్టారు. సినిమా ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా సాగిన శ్రవణ్ రెడ్డి నటన ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. ఈ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు ఎం.ఎస్. రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, కథానాయికగా కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో నటించారు.

Exit mobile version