ఇప్పుడు ఒక్క ఇండియన్ సినిమా మార్కెట్ లోనే కాకుండా ప్రపంచ సినిమా దగ్గరే భారతీయ సినిమాని సగర్వంగా ముందుకి తీసుకెళ్తున్న ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే అది మన టాలీవుడ్ ఇండస్ట్రీ వేసిన దారి లోనే అని చెప్పాలి. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి స్టార్ట్ చేసిన ట్రెండ్ తోనే ప్రపంచ వ్యాప్తంగా రీచ్ ని సొంతం చేసుకోవాలని అనేక సినిమాలు, మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
అయితే ఈ క్రమంలో టాలీవుడ్ కొందరిలో టార్గెట్ అయ్యింది అనే మాట కూడా వాస్తవం. ముఖ్యంగా బాలీవుడ్ లో ఓ సెక్షన్ తెలుగు సినిమాలు, ఆడియెన్స్ మరియు దర్శకుల పట్ల సాన్నిహిత్యంగా ఉన్నప్పటికీ ఇంకొక సెక్షన్ మాత్రం తమ అక్కసు బయటపెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఆ లిస్ట్ లో ఇపుడు బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చేరడం సోషల్ మీడియాలో టాలీవుడ్ యువత నడుమ చర్చగా మారింది.
ఆ మధ్య అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ విషయంలో మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ విషయంలో ఎవరో నెటిజన్ టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలు అన్నీ ప్లాప్స్ అయ్యాయని ఓ లిస్ట్ పెడితే దానికి వ్యంగ్యంగా సపోర్ట్ చేస్తూ ‘ఊప్స్’ అంటూ సిద్ధార్థ్ ఆనంద్ రిప్లై ఇచ్చాడు. దీనితో ఇక మన తెలుగు యువత తగులుకున్నారు.
వార్, పఠాన్ లాంటి సినిమాలు ఇప్పుడు షారుఖ్ ఖాన్ లాంటి హీరోతో కింగ్ సినిమా వంటివి చేస్తున్నప్పటికీ సిద్ధార్థ్ ఆనంద్ ఎందుకు ఇలాంటి ఆలోచనా ధోరణితో ఉండిపోయాడు అంటూ సోషల్ మీడియాలో తన రిప్లైకి మరింత పదునైన రిప్లైలు అందిస్తున్నారు. అయితే మన సినిమాలు ప్లాప్ అయ్యాయి అని చెప్పిన వ్యక్తి పోస్ట్ డిలీట్ చేసుకున్నాడు కానీ సిద్ధార్థ్ రిప్లై మాత్రం ఉండిపోయింది.
అయితే ఇదేమి సిద్ధార్థ్ సైడ్ నుంచి ఇది మొదటిసారి కాదు. ఆ మధ్య ప్రభాస్ ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ స్పిరిట్ కి ప్రెజెంట్ చేయడంపై కూడా పరోక్షంగా కౌంటర్లు ఇచ్చాడు. ఇలా మొత్తానికి బాలీవుడ్ లో ఒక వర్గానికి టాలీవుడ్ నిద్ర పట్టకుండా చేసిందా అనుకోవాల్సి పరిస్థితి ఇప్పుడు నెలకొంది.
