ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ ‘చెన్నై లవ్ స్టోరీ’

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా దర్శకుడు రవి నంబురి తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రమే చెన్నై లవ్ స్టోరీ. ప్రముఖ దర్శకుడు, రచయిత సాయి రాజేష్ కథ అందించిన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది. ఇలా కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు అందులో నేటి నుంచి సినిమా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఈ కల్ట్ లవ్ స్టోరీని చూడాలి అనుకుంటే ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. అలాగే సాయి రాజేష్, ఎస్ కే ఎన్ నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version