మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమే ‘ఇరుముడి’. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ నేడు గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొచ్చారు. ఇక ఈ చిత్రంపై మొదటి నుంచీ ఉన్న సాలిడ్ బజ్ తో థియేటర్స్ లోకి వచ్చిన ఈ ప్రాజెక్ట్ కి సాలిడ్ ఎర్లీ రిపోర్ట్స్ దక్కుతున్నాయి.
ఆల్రెడీ ఇతర దేశాల్లో ఇరుముడి ప్రీమియర్స్ పడ్డాయి. అక్కడ నుంచే మాస్ మహారాజ్ రవితేజ కంబ్యాక్ కొట్టేశారని టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో మొదలైన పాజిటివిటీ ఇప్పుడు సినిమా విడుదల అయ్యాక కూడా చెక్కు చెదరలేదు. ఇక ఫైనల్ రన్ లో సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.
