సినీ ఇండస్ట్రీలో ఒకరి నిర్ణయం మరొకరికి లాభం చేకూర్చడం సర్వసాధారణం. నాని ‘ది ప్యారడైజ్’ అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంతో, ఆ స్లాట్‌ను సరిగ్గా ఉపయోగించుకుంది ‘ఇరుముడి’. వరలక్ష్మి వ్రతం సెలవు దినం కలిసిరావడంతో పాటు కుటుంబ ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టడంతో ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ దక్కాయి.
ప్రస్తుతం వస్తున్న వరుస సెలవులు, పాజిటివ్ టాక్ ఈ సినిమా వసూళ్లను మరింత పెంచుతున్నాయి. అయితే, త్వరలో రానున్న యష్ ‘టాక్సిక్’ ప్రభావం ఈ చిత్రంపై ఏ మేరకు ఉంటుందనే టెన్షన్ ఫ్యాన్స్‌లో నెలకొంది. మరో నాలుగు రోజుల్లో దాని ఫలితం తేలిపోనుంది.
శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.
