మనోజ్‌ కోసం కీలక పాత్రలో శింబు ?

రాకింగ్ స్టార్ మంచు మనోజ్‌ కి – తమిళ హీరో శింబుకి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ సాన్నిహిత్యం కారణంగానే ఇప్పుడు మనోజ్ సినిమాకి సపోర్ట్ గా ఓ కీలక పాత్రలో శింబు నటించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘డేవిడ్‌ రెడ్డి’. కాగా ఈ సినిమాలో శింబుది మనోజ్ కి అన్నయ్య పాత్ర అని.. కేవలం ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే శింబు పాత్ర వస్తోందని టాక్ నడుస్తోంది. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూట్ శరవేగంగా జరుగుతుంది.

ఇక ‘డేవిడ్‌ రెడ్డి’ కథ విషయానికొస్తే.. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఇది. బ్రిటిష్‌ వారిపై పోరాడిన ‘డేవిడ్‌ రెడ్డి’ అనే యోధుడి కథగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘వార్‌ డాగ్‌’ అనే బైక్‌ను రూపొందించారు. దాని బరువు దాదాపు 700 కేజీలు. సినిమాలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నట్టు ఈ సినిమాలో మనోజ్‌ సరసన ‘ప్రిన్స్‌’ (కోలీవుడ్‌ మూవీ) హీరోయిన్‌ మరియా నటించబోతుంది.

Exit mobile version