విడుదల తేదీ : ఆగస్టు 26, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : యశ్, కీయారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, సుదేవ్ నైర్ తదితరులు
దర్శకత్వం : గీతూ మోహన్ దాస్
సంగీతం : రవి బాసృర్, తనిష్క్ బాక్చి, విశాల్ మిశ్రా
నిర్మాతలు : యశ్, కే వెంకట నారాయణ
ఛాయాగ్రహణం : రాజీవ్ రవి
కూర్పు : ఉజ్వల్ కులకర్ణి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లాంగ్ అవైటెడ్ చిత్రమే “టాక్సిక్”. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ భారీ సినిమా ఇంత లేట్ అయినా కూడా షాకింగ్ బుకింగ్స్ తో ఈ సినిమా థియేటర్స్ లో విడుదలకి వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ గోవా ప్రాంతం మాత్రం పోర్చుగీస్ వారి ఆధీనంలోనే ఉంటుంది. అలా సాల్వడార్ బ్రదర్స్ చేతిలో నడిచే డ్రగ్ మాఫియాని ఇద్దరు అక్క తమ్ముళ్లు గంగ (నయనతార), రాయా (యశ్) ల అండతో మరింత బలంగా నిలబడుతుంది. ఈ క్రమంలో సాల్వదార్ కూతురు రెబకా (తారా సుతారియా) ని పెళ్లి చేసుకొని ఆ సామ్రాజ్యానికి అధిపతి అవుతాడు. కానీ తన జీవితంలోకి వచ్చిన ఒక సర్కస్ అమ్మాయి నదియా (కీయారా అద్వానీ) ని రాయా ప్రేమించడం మొదలు పెడతాడు. ఇక అక్కడ నుంచి వీరి లవ్ ట్రాక్ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అక్కడ నుంచి రాయాకి ఏమైంది? తన కొడుకే (టికెట్) ఎందుకు రాయాని చంపాలని పగ పడతాడు? చివరికి రాయా ఏమవుతాడు అనేవి ఇందులో అసలు కథ.
ప్లస్ పాయింట్స్:
మొదటి నుంచీ మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమాలో మాస్ ఆడియెన్స్, ముఖ్యంగా యశ్ తరపున కే జి యఫ్ స్టైల్ యాక్షన్, పెర్ఫార్మన్స్ లని కోరుకునే వారికి అక్కడక్కడా మూమెంట్స్ మాత్రం ఎంగేజ్ చేస్తాయి. తన మార్క్ బాడీ లాంగ్వేజ్, యాక్షన్ పార్ట్ ఇంకా పంచ్ డైలాగ్స్ తో యశ్ మంచి కిక్ ఇస్తాడు.
అంతే కాకుండా తన కొడుకు రోల్ లో టికెట్ గా మాత్రం పెర్ఫామెన్స్ అదరగొట్టాడని చెప్పవచ్చు. క్లైమాక్స్ పార్ట్ లో తన పెర్ఫామెన్స్ లు ఇందులో బాగున్నాయి. ఇక నయనతార, కీయారా అద్వానీ కాంబినేషన్లో సీన్స్ డీసెంట్ గా అనిపిస్తాయి.
ఫస్టాఫ్ లో నయన్, యశ్ ల ఎమోషనల్ ట్రాక్, అలాగే కీయారాతో లవ్ ట్రాక్ కూడా మెప్పిస్తుంది. వీరిలో కీయారా కూడా ఇందులో సాలిడ్ పెర్ఫార్మన్స్ చేసింది. తన పాత్రకి కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా అందులో లోతు, హావభావాలతో బాగా చేసింది. ఇక రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి లు తమ పాత్రల్లో బాగా చేశారు. వీరితో పాటుగా ఇతర నటీనటులు కూడా ఇందులో బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్:
ఒక రొటీన్ కథ ఉన్నప్పటికీ నడిపించే కథనం ఎంగేజింగ్ గా ఉంటే చూసే ఆడియెన్ కథ లైన్ వంటి వాటిని పెద్దగా పట్టించుకోడు. కానీ టాక్సిక్ లో బలమైన కథ మిస్ అయ్యింది. డెఫినెట్ గా కే జి యఫ్ తర్వాత సినిమా అంటే యశ్ విషయంలో ప్రతీ అంశాన్ని బెటర్ గానే ఆశిస్తారు.
పైగా టాక్సిక్ ని కన్నడ, ఇంగ్లీష్ అంటూ నేరుగా హాలీవుడ్ నే టార్గెట్ చేశారు. సో ఏదో బలమైన కంటెంట్ నే పట్టుకొని ఉండొచ్చు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఫస్టాఫ్ అంతా రొటీన్ ప్లాట్ లోనే నడుస్తుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ పర్వాలేదు కానీ ఆ డ్రగ్ మాఫియా, కే జి యఫ్ ఫ్లేవర్ ఎలివేషన్స్ డైలాగ్స్ వంటివి డిజప్పాయింటింగ్ గా అనిపిస్తాయి.
ఇక సెకండాఫ్ లో డ్రామా మరింత బోర్ కొట్టిస్తుంది. అసలు రుక్మిణి వసంత్ ట్రాక్ ఎందుకు పెట్టారో అర్ధం కాదు. నదియా రోల్ ని అంతలా ప్రేమించిన రాయా వారికి కలిగే సంతానంపై చూపించని ప్రేమ, అసలు ప్రేమించని అమ్మాయితో అంత కాలం ఉండడం, వారి సంతానంపై అంత ప్రేమ లాంటివి అసలా ట్రాక్ లోనే కన్ఫ్యూజ్ గా వీక్ గా అనిపిస్తాయి.
ఇక ఈ అంతటిలో వైలెన్స్ కూడా పక్కన పెడితే బోల్డ్ ఇంటిమేట్ సీన్స్ బాగా ఎక్కువయ్యాయి అనిపిస్తుంది. అలానే ఫైనల్ గా రీవీల్ చేసిన ట్విస్ట్ కూడా తెలుగు ఆడియెన్స్ కి బహుశా ఎగ్జైట్ చేయకపోవచ్చు. అంతేకాకుండా యశ్ పాత్రపై అందరిలో ఒక సిల్లీ ఫీల్ కలగడంతో అప్పటివరకు ఇచ్చిన బిల్డప్ అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారుతుంది. ఇలా టాక్సిక్ లో అనేక అంశాలు నిరాశ పరుస్తాయి.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. గ్రాండ్ సెట్ వర్క్ బాగున్నాయి. హాలీవుడ్ సంస్థ అందించిన వి ఎఫ్ ఎక్స్ పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా రిచ్ గా అవి ఉండాల్సింది. రాజీవ్ కెమెరా వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. చాలా సీన్స్ తగ్గించాల్సింది. అలాగే తెలుగు డబ్బింగ్ మాత్రం ఇంకా బెటర్ గా ఉండాల్సింది. చూసే కంటెంట్ అంతా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ మాటలు మాత్రం మూసగా అనిపిస్తాయి. రవి బసృర్ స్కోర్ మాత్రం అంత చెప్పుకోదగ్గ రేంజ్ లో లేదు.
ఇక దర్శకురాలు గీతూ మోహన్ దాస్ విషయానికి వస్తే.. తను మాత్రం డిజప్పాయింటింగ్ చేసారని చెప్పక తప్పదు. పూర్తిగా ఇలా బోల్డ్, యాక్షన్ ఎలిమెంట్స్ తోనే ప్లాన్ చేసుకున్నారా తర్వాత పరిస్థితులు మారాయా ఏమో కానీ తను ప్లాన్ చేసుకున్న పాయింట్ ని మాత్రం చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గా అనవసర హంగులు, ఆర్భాటాలు యాడ్ చేసి ఆఖరికి నిరుత్సాహన్ని మిగిల్చారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “టాక్సిక్” వచ్చిన హైప్ ని మాత్రం అందుకోలేకపోయింది. యశ్ వరకు తన పని నటన వరకు సిన్సియర్ గా చేసి ఇంప్రెస్ చేశారు. కానీ రచనా సహకారం డిజప్పాయింటింగ్ గా ఉంది. స్టార్ నటీనటులు పెర్ఫార్మన్స్ లు, కొన్ని యాక్షన్ సీన్స్, ఒకటీ రెండు చోట్ల ఎమోషన్స్ ఓకే కానీ పస లేని కథనం, బలం లేని కథ, సాగదీతగా అనిపించే సెకండాఫ్ చూసే ఆడియెన్ లోని ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. సో వీటితో టాక్సిక్ అంతగా ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team
