‘విశ్వంభర’ అప్పుడు కూడా రానట్టే!

vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే ‘విశ్వంభర’. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా సీజీ అవుట్ పుట్ మేకర్స్ కి పెద్ద తలనొప్పిగా మారింది. ఇక అన్నీ అయ్యి ఈ దసరా బరిలో సినిమాని మేకర్స్ నింపే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్ కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఇప్పుడు ‘విశ్వంభర’ ఈ దసరాకి కూడా రానట్టే అని ఖరారు అయ్యిపోయింది.

ఈ దసరా రేస్ డేట్స్ లో విశ్వంభర ఒక్కటే తెలుగు నుంచి ముందు రిలీజ్ డేట్ లాక్ చేసుకుందని సినీ వర్గాల్లో ఇన్ఫో బయటకి వచ్చింది. కానీ ఇప్పుడు ఇదే రేస్ లో విజయ్ దేవరకొండ భారీ చిత్రం రణబాలి నిలిచింది. సో విశ్వంభర రావడం లేదు అని కన్ఫర్మ్ అయ్యాకనే ఈ సినిమా అనౌన్స్ చేసినట్టు సమాచారం. సో రజినీకాంత్ జైలర్ 2 తో క్లాష్ లో విశ్వంభర లేనట్టే అని చెప్పాలి. అసలిక ఈ ఫాంటసీ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందో ఒకవేళ వస్తే మినిమమ్ వసూళ్లు అయినా వస్తాయో లేదో అనేది కాలమే నిర్ణయించాలి.

Exit mobile version