ప్రస్తుతం టాలీవుడ్ సినిమా నుంచి రానున్న పలు అవైటెడ్ భారీ చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో చేస్తున్న మాసివ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ కూడా ఒకటి. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాని ఆ అంచనాలకి ఏ మాత్రం తీసిపోకుండా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఫైనల్ గా సినిమా నుంచి అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండో సాంగ్ ‘యేశ నాగుల’ ఫుల్ వెర్షన్ వచ్చేసింది. తెలంగాణ ఫోక్ సాంగ్ గా ఇది చాలామందికి తెలుసు. అయితే ఇలాంటి ఓ బిగ్ ప్లాట్ ఫామ్ పై పైగా అనిరుద్ లాంటి స్టార్ సంగీత దర్శకుడు నుంచి ఈ సాంగ్ కంపోజ్ చేసి రావడం మరింత స్పెషల్ గా మారింది.
అయితే ఈ సాంగ్ ని మేకర్స్ డల్లాస్ లో లైవ్ పెర్ఫామెన్స్ తో అక్కడ విడుదల చేసి అదరగొట్టారు. ఇక ఆన్లైన్ లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి పలు మ్యూజిక్ ప్లాట్ ఫామ్ లలో అందుబాటులోకి తెచ్చేసారు. యూట్యూబ్ కంటే ముందే అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై లాంటి ఇతర మ్యూజిక్ ప్లాట్ ఫామ్ లలో అందుబాటులోకి వచ్చేసిన ఈ సాంగ్ ఫుల్ ఎనర్జిటిక్ గా సాగింది అని చెప్పవచ్చు.
ఒరిజినాలిటీ ఎక్కడా మిస్ కాకుండా అనిరుద్ క్లారిటీగా అంతకు మించిన మాస్ బీట్స్ తో తన నుంచి ఒక పక్కా ఊరమాస్ సాంగ్ ని వదిలాడని చెప్పవచ్చు. ఇక థియేటర్స్ లో డెఫినెట్ గా ఈ సాంగ్ ఒక బ్లాస్ట్ లా పేలుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఈ సాంగ్ లో స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ నాని సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఈ చిత్రానికి ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించగా ఈ సెప్టెంబర్ 24న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
