విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నారు. ఐతే, ఇంకా షూట్ ఫినిష్ కాలేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ బ్యాలెన్స్ ఉందని.. అలాగే ఓ సాంగ్ కూడా షూట్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ రెండో వారంలో సాంగ్ షూట్ చేస్తారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్నట్టు ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, యువిన, రాజ్ ప్రజ్పల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది.
