రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘టార్టాయిస్’ అనే టైటిల్ను ఖరారు చేస్తూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన స్లీప్ వాకింగ్ వీడియోకు ముగింపు పలుకుతూ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో రక్తపు మరకలతో, ఒక డెడ్ బాడీ పక్కన కత్తితో కూర్చుని ఉన్న రాజ్ తరుణ్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సస్పెన్స్, డ్రామా కలగలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ కథను రూపొందిస్తున్నారు.
ఈ చిత్రంలో అమృత చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా.. అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ, షిజు ఏఆర్, రవి కాలె కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు శబరి విగ్నేష్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. ఇతర వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.
