ఇప్పుడిప్పుడే ఇండియన్ సినిమా మార్కెట్ పాన్ వరల్డ్ లెవెల్ కి విస్తరిస్తుంది. తన సినిమాలతో దర్శకుడు రాజమౌళి వేసిన బాటలో డైరెక్ట్ ఇంగ్లీష్ లోనే తెరకెక్కించి విడుదల చేసిన భారీ చిత్రమే ‘టాక్సిక్’. శాండిల్ వుడ్ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం కన్నడ, ఇంగ్లీష్ రెండు భాషల్లో మేకర్స్ ఒకేసారి తెరకెక్కించారు.
దీనితో ఇండియన్ సినిమా నుంచి ఇదొక ప్రయోగాత్మక చిత్రంగా హాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్, పాపులర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ లయన్స్ గేట్ వారితో హాలీవుడ్ లో రిలీజ్ చేశారు. సరే థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది కానీ ఆ తర్వాత అసలు ఈ సినిమాకి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది మినిమమ్ కూడా బయటకి రాలేదు.
వరల్డ్ వైడ్ 150 కోట్ల పోస్టర్ డే 1 కి మేకర్స్ వేశారు. మేజర్ గా హిందీ, తెలుగు, కన్నడ లోనే సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. కానీ డైరెక్ట్ ఇంగ్లీష్ లో కూడా తెరకెక్కించిన ఈ సినిమాకి హాలీవుడ్ లో కనీస ఆదరణ కూడా కరువైంది అని చెప్పక తప్పదు. ఇంగ్లీష్ వెర్షన్ లో 1 మిలియన్ డాలర్ గ్రాస్ కూడా సినిమాకి రాలేదని తెలుస్తుంది. సో మేకర్స్ ఎఫర్ట్స్ పూర్తిగా వృథా అయ్యాయని చెప్పక తప్పదు. కానీ ఒక ప్రయత్నం అయితే చేశారు. సో ఓటిటిలోకి వచ్చాక అయినా సినిమాకి మంచి రీచ్ ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే.
