కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం ‘ధర్మన్’ కోసం అందరికీ తెలిసిందే. ఒక డెడ్లి డాక్టర్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ ఇందులో నటిస్తుండగా మేకర్స్ శరవేగంగా సినిమా షూట్ ని ప్రస్తుతం చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మన టాలీవుడ్ కి చెందిన యువ హీరో రామ్ పోతినేని కూడా నటిస్తున్నట్టుగా ఓ టాక్ వచ్చింది.
పైగా తాను విలన్ రోల్ అంటూ ఆ మధ్య వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా రామ్ ఆల్రెడీ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఒకపక్క తన స్వీయ దర్శకత్వం సినిమాలోనే కాకుండా ధర్మన్ లో కూడా గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా టాక్. అంతే కాకుండా ధర్మన్ లో తనది చాలా పెద్ద రోల్ అనే అని కూడా సినీ వర్గాల్లో వినిపిస్తుంది. సో వీటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
