ట్విస్ట్: “జైలర్” తప్పుకోబోతున్నాడా?

Jailer2

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు చేసిన అవైటెడ్ సినిమానే జైలర్ 2. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో చేసిన పార్ట్ 1 సెన్సేషనల్ హిట్ కావడంతో అభిమానులు పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో మొదటి నుంచీ మేకర్స్ లిమిటెడ్ గానే అప్డేట్స్ అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఫైనల్ గా విడుదల తేదీని ఈ అక్టోబర్ 15కి దసరా కానుకగా విడుదలకి ప్లాన్ చేసారు.

అయితే ఇన్ని రోజులు సినిమా విషయంలో ఎలాంటి రాజీ లేదు అనే సినీ వర్గాల్లో వినిపించింది కానీ తాజాగా జైలర్ 2 అనుకున్న సమయానికి రాకపోవచ్చు అనే కొత్త ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. దాదాపు రాకపోవడానికే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మేకర్స్ ఏమన్నా కొత్త అప్డేట్ తో క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version