సినిమా హిట్కి కావాల్సింది బడ్జెట్ కాదు.. బలమైన కథ అని ‘ఇరుముడి’ మరోసారి బలంగా నిరూపించింది. అలాగే మరోవైపు ఒక సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తే కచ్చితంగా హిట్ అవుతుందనుకోవడం పొరపాటే అని ‘టాక్సిక్’ సినిమా రుజువు చేసింది. ఈ సినిమాకి భారీ స్థాయిలో ఖర్చు చేసినప్పటికీ, విడుదల తర్వాత మిశ్రమ స్పందన రావడంతో రెండో రోజు నుంచే వసూళ్లు భారీగా పడిపోయాయి. అటు రిలీజ్ అయి రెండు వారాలు దాటిపోతున్నా.. ఇరుముడి కలెక్షన్స్ రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.
నిజానికి కమర్షియల్ అంశాలతో ఫుల్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ లతో టాక్సిక్ ను తీసుకువచ్చారు. అయినా, ఉపయోగం లేకుండా పోయింది. ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చివరికి టాక్సిక్ థియేటర్స్ కూడా ఇరుముడికి వెళ్లిపోతున్నాయి. ఆ సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. దీంతో, సినిమా విజయానికి కావాల్సింది భారీ ఖర్చు, భారీ తారాగణం కాదు అని మరోసారి రుజువు అయింది. బలమైన కథకి మరింత బలం చేకూర్చేలా ఎమోషన్ పెట్టి, ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే అనుభూతిగా సినిమాని మార్చితే.. కచ్చితంగా సినిమా విజయం సాధిస్తోందని ఇరుముడి ఓ దారి చూపించింది.
