‘సామజవరగమన’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత హీరో శ్రీవిష్ణు మరియు దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో మరో హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి వినోదం మరియు సరికొత్త కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
అయితే, ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. పండుగ వాతావరణానికి పక్కా కామెడీ సబ్జెక్ట్ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్న నిర్మాతలు, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ‘సామజవరగమన’కి సూపర్ హిట్ స్క్రిప్ట్ అందించిన రైటర్స్ భాను భోగవరపు, నందు ఈ చిత్రానికి కూడా కథ-మాటలు అందిస్తుండటం విశేషం.
ఇప్పటికే సంక్రాంతి రేసులో పలు బడా చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇక ఇప్పుడు శ్రీవిష్ణు కూడా ఈ పోటీలోకి దిగుతుండటంతో పండుగ వార్ మరింత ఆసక్తికరంగా మారనుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.
