‘రాకా’లో ట్రిపుల్ రోల్ పై కొత్త రూమర్ వైరల్.!

raaka

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం రాకా కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు అట్లీ కాంబినేషన్లో చేస్తున్న ఈ ఫాంటసీ జానర్ సినిమా పట్ల మంచి హైప్ నెలకొంది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఐకాన్ స్టార్ ఈ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ట్రిపుల్ రోల్ లో ట్రీట్ ఇవ్వనున్నాడు అని ఎప్పుడు నుంచో పలు రూమర్స్ ఉన్నాయి.

అయితే వీటిలో రెండు తండ్రీకొడుకులు గా కూడా బన్నీ కనిపిస్తాడు అని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు కొత్త రూమర్ వైరల్ గా మారింది. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ డోపల్ గ్యాంగర్ గా కనిపిస్తుంది అని తెలుస్తోంది. అంటే కనిపించే మూడు పాత్రలు శారీరికంగా ఒకే పోలికలు కనిపించవచ్చు కానీ జన్యు పరంగా ఎలాంటి రక్త సంబంధం వారికి ఉండదట. సో ఈ కొత్త రూమర్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version