ఈ వారంలో థియేటర్స్ లో అలరించేందుకు వస్తున్న లేటెస్ట్ సినిమాల్లో యువ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా ఆనందిక సనీల్ కుమార్ హీరోయిన్ గా దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి తెరకెక్కించిన రోమ్ కామ్ ఎంటర్టైనర్ రొమాంచకం కూడా ఒకటి. ఈ సినిమాని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో రెబల్ స్టార్ ప్రభాస్ చేయి కూడా సినిమా ప్రమోషన్స్ కోసం పడింది.
అయితే లేటెస్ట్ గా ప్రభాస్ తన రెబల్స్ అందరికీ ఓ పిలుపు ఇచ్చాడు. నాకు మీలాంటి ఒక అభిమానే ఇప్పుడు హీరోగా తన సినిమాతో వస్తున్నాడు. సో ఓపెనింగ్స్ అదిరిపోవాలి అంటూ ఇతర ఫ్యాన్స్ కి తన ఫ్యాన్ హీరో సినిమాకి సపోర్ట్ అందించి చిత్ర యూనిట్ కి మంచి ఎనర్జీ అందించారు. దీనితో తన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రానికి వాసుకి వైభవ్ సంగీతం అందించారు. అలాగే అనిమల్ నటుడు ఉపేందర్ లిమాయే కూడా కీలక పాత్ర పోషించడం విశేషం.
v
Openings Adiripovali 💥💥
The entire #Romanchakam gang has a reason to celebrate today ❤️🔥
A true DARLING in and out 😍🫶🏻
Leaving the #Romanchakam team with words of encouragement and all the love 💥💥And now… the PREMIERES have begun everywhere ✨#Prabhas pic.twitter.com/hU0MCbBiuW
— Bhadrakali Pictures (@VangaPictures) September 2, 2026
