చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ హీరోగా చేసిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రమే రంభ ఊర్వశి మేనక. దర్శకుడు చంద్ర మోహన్ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల ప్రమోషనల్ కంటెంట్ తో ట్రెండింగ్ లో నిలిచింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తున్న నేపథ్యంలో జరిపిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లరి నరేష్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది. ఈ సినిమా విషయంలో తను చాలా నమ్మకంగా ఉన్నాడు.
ఈ సినిమా సెప్టెంబర్ 4న విడుదల అయితే 9న మా సక్సెస్ మీట్ ఉంటుంది అని ఈసారి డెఫినెట్ గా తను హిట్ కొడుతున్నాను అని ఇదివరకు లేని విధంగా సాలిడ్ కాన్ఫిడెన్స్ తో తను చెప్పడం జరిగింది. దీనితో ఈ సినిమా విషయంలో తను ఎంత నమ్మకంగా ఉన్నాడో అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా రాజేష్ దండ నిర్మాణం వహించారు.
