దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు..!

మలయాళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ఆర్ డి ఎక్స్ దర్శకుడు నహాస్ హైదత్ తెరకెక్కించిన సాలిడ్ థ్రిల్లర్ చిత్రమే ఐమ్ గేమ్. ఎప్పుడు నుంచో విడుదల కోసం చూస్తున్న ఈ సినిమా ఫైనల్ గా నేడు పాన్ ఇండియా లెవెల్లో విడుదలకి వచ్చింది. అయితే నిన్న రాత్రే ఈ సినిమా తెలుగు సహా ఇంకొన్ని భాషల్లో విడుదల, ముఖ్యంగా ఉదయం షోలు ఉండకపోవచ్చు అనే టాక్ వినిపించింది.

ఇక అనుకున్నట్టే మన దగ్గర దుల్కర్ సినిమా ఉదయం షోస్ రద్దు కాబడినట్టు కన్ఫర్మ్ అయ్యింది. సో దాదాపు సినిమా మధ్యాహ్నం షోస్ నుంచి మొదలు కావచ్చు. అయితే దీనికి కారణం సెకండాఫ్ కంటెంట్ అందడంతో నెలకొన్న జాప్యమే కారణం అన్నట్టు టాక్. సో ఇది దుల్కర్ అభిమానులకి ఒకింత డిజప్పాయింట్ చేసే వార్తే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి దుల్కర్ నిర్మాణం వహించగా క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజొయ్ సంగీతం అందించారు.

Exit mobile version