గ్రామాల నుంచి ట్రాక్టర్లలో జనం: టాలీవుడ్‌కి గత వైభవాన్ని గుర్తు చేస్తున్న ‘ఇరుముడి’!

irumudi

ముఖ్య అంశాలు

  • మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది.
  • 3వ వారంలోకి అడుగుపెట్టినా ఏమాత్రం జోరు తగ్గకుండా, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు ట్రాక్టర్లలో థియేటర్లకు తరలివస్తూ సందడి చేస్తున్నారు.
  • మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ భావోద్వేగ భక్తి చిత్రం 3వ వారంలోకి అడుగుపెట్టినా అదే జోరు కొనసాగిస్తోంది. బి, సి సెంటర్లలో మాత్రమే కాకుండా అన్ని ప్రధాన కేంద్రాల్లోనూ హౌస్‌ఫుల్ బోర్డులతో సందడి చేస్తోంది.

గ్రామాల నుంచి ట్రాక్టర్లలో వస్తున్న జనం

ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ సినిమాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి కుటుంబాలు కుటుంబాలుగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో థియేటర్లకు వచ్చేవారు. ఇప్పుడు సరిగ్గా ‘ఇరుముడి’ సినిమా విషయంలో టాలీవుడ్ ఆ పాత వైభవాన్ని మళ్ళీ చూస్తోంది. గ్రామాల్లోని ప్రజలు ట్రాక్టర్లు కట్టుకుని థియేటర్లకు పోటెత్తుతున్నారు. థియేటర్ల ఆవరణలో డప్పు చప్పుళ్లు, స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో నిజమైన పండగ వాతావరణం నెలకొంది.

మనసుల్ని హత్తుకున్న కథ

అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంలో తండ్రీకూతుళ్ల మధ్య సాగే లోతైన అనుబంధాన్ని దర్శకుడు శివ నిర్వాణ ఆవిష్కరించిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను కదిలించింది. త్రినాథ్ పాత్రలో రవితేజ చూపించిన పరిపక్వమైన నటన, బేబీ నక్షత్ర అమాయకత్వం, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్‌ల నటన సినిమాకు మరింత బలాన్నిచ్చింది.

కంటెంట్‌లో నిజాయతీ ఉంటే తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ‘ఇరుముడి’ సాధిస్తున్న ఘన విజయం మరోసారి నిరూపిస్తోంది.

Exit mobile version