‘ఆదర్శ కుటుంబం’ కోసం స్పెషల్ ప్రమోషన్స్ ?

విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఈ చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పై కొన్ని ఆసక్తికరమైన ప్రమోషన్స్ ను ప్లాన్ చేశాడట త్రివిక్రమ్. ఈ క్రమంలోనే వెంకటేష్ తో పాటు పలు స్పెషల్ ఇంటర్వ్యూలను అలాగే కొన్ని ప్రత్యేక టూర్ లను కూడా ప్లాన్ చేశారట. త్రివిక్రమ్ కూడా ప్రత్యేకంగా ఈ సినిమా కోసం ఇంటర్వ్యూలు ఇస్తారట. మొత్తానికి ప్రమోషన్స్ లో ఈ మధ్య డైరెక్టర్ లు ఎక్కువగా ఇన్ వాల్వ్ అవుతున్నారు.

ఇక ఈ సినిమా ఇంటర్వెల్ లో వచ్చే నారా రోహిత్ ఎంట్రీ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, యువిన, రాజ్ ప్రజ్పల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.

Exit mobile version