భారతీయ సంగీత దిగ్గజం ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన మేకర్స్, దీనికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ చేశారు.
రేపు(సెప్టెంబర్ 16న) సాయంత్రం 5:15 గంటలకు ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి గారి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుండగా, ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతానికి ఎంతో ప్రాధాన్యమున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తున్నాడు.
ఇక గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ మరియు బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. మరి ఈ చిత్రానికి మేకర్స్ ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.
