న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే నార్త్ అమెరికా ప్రీ-సేల్స్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన రెండో సింగిల్ సాంగ్ ‘యేష నాగుల’ యూట్యూబ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ తెలంగాణ జానపద శైలిలో స్వరపరిచిన ఈ పాట, కాసర్ల శ్యామ్ సాహిత్యం మరియు జానపద కళాకారుల గాత్రంతో అత్యంత వేగంగా 100 మిలియన్ల వ్యూస్ మరియు 705K కంటే ఎక్కువ లైక్స్ సాధించిన తొలి తెలుగు పాటగా రికార్డు నెలకొల్పింది.
ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ పాటలో నాని, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో వచ్చిన డాన్స్ బిట్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అనిరుధ్ అందించిన ఈ మ్యూజికల్ సెన్సేషన్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయగా, నార్త్ అమెరికాలోనూ బుకింగ్స్ జోరందుకున్నాయి. సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, కయాదు లోహర్, రాఘవ్ జుయల్ మరియు సంపూర్ణేష్ బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా, ఈ చార్ట్‌బస్టర్ సాంగ్‌తో ప్రేక్షకుల్లో మరిన్ని భారీ అంచనాలను నెలకొల్పింది.
