సందీప్ కిషన్ ‘సిగ్మా’.. తెలుగులో తీసుకొస్తుంది వీరే..!

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సిగ్మా’ ప్రేక్షకులలో మంచి అంచనాలను నెలకొల్పింది. కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రిప్పింగ్ హైస్ట్ థ్రిల్లర్‌ను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని నైజాం మరియు కోస్తాంధ్ర ప్రాంతాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

అటు సీడెడ్ హక్కులను ఎన్విఆర్ సినిమాస్ సొంతం చేసుకుంది. యువ దర్శకుడు జేసన్ సంజయ్, సందీప్ కిషన్‌ను అత్యంత స్టైలిష్‌గా, పవర్‌ఫుల్ యాక్షన్ అండ్ స్వాగ్‌తో తెరకెక్కించిన తీరు డిస్ట్రిబ్యూటర్లలో సైతం నమ్మకాన్ని పెంచింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన పాటలతో పాటు టీజర్, ట్రైలర్‌లకు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు విశేష ఆదరణ లభించింది.

ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మరి ఈ సినిమాతో సందీప్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version