అందాల భామ మాళవిక మోహనన్‌కు తమిళంతో పాట ఇతర ఇండస్ట్రీల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆమె వివిధ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. స్టార్ హీరోలు, అగ్ర దర్శకుల సినిమాల్లో భాగమైనా విజయాన్ని వరుస ప్రాజెక్ట్‌లుగా మలచుకోవడంలో ఆమె వెనుకబడింది. తమిళంలో ‘పేట’, ‘మాస్టర్’ వంటి పెద్ద సినిమాలతో మంచి పాపులారిటీ సాధించిన ఆమె, ఆ క్రేజ్‌తో వరుస బాక్సాఫీస్ విజయాలను మాత్రం అందుకోలేకపోయింది.
ఇటీవల ఆమె నటించిన ‘మారన్’, ‘క్రిస్టీ’, ‘తంగలాన్’, ‘యుధ్ర’లతో పాటు ‘హృదయపూర్వం’ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. ఇక ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజా సాబ్’తో పాటు తాజాగా విడుదలైన ‘సర్దార్ 2’ కూడా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడం ఆమె కెరీర్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
విజయాలు దక్కకపోయినప్పటికీ ఇప్పటికీ వరుసగా మంచి ప్రాజెక్ట్‌లను దక్కించుకుంటున్న మాళవిక, తన నెక్స్ట్ సినిమాలతోనైనా తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
