అల్లు అర్జున్-అట్లీ ‘రాకా’ 37 పోస్టర్ : సోషల్ మీడియాలో మొదలైన క్రేజీ థియరీలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’ నుంచి వచ్చిన ఒకే ఒక్క పోస్టర్ సినీ ప్రియుల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. కొద్ది నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ తాజాగా ఒక క్రైప్టిక్ పోస్టర్‌ను వదిలారు. డార్క్ బ్యాక్‌డ్రాప్‌లో కేవలం ‘37’ అనే నంబర్‌ను మాత్రమే చూపిస్తూ విడుదల చేసిన ఈ లుక్, అభిమానుల్లో సరికొత్త చర్చకు తెరతీసింది.

ఈ ‘37’ వెనుక ఆంతర్యం ఏమిటనే దానిపై సోషల్ మీడియాలో ఇప్పటికే రకరకాల థియరీలు చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు అట్లీ పుట్టినరోజు సెప్టెంబర్ 21. దీంతో గణిత సమీకరణం 3 × 7 = 21 అవుతుందని, సెప్టెంబర్ 21న ‘రాకా’ నుంచి ఏదైనా భారీ అప్‌డేట్ రాబోతోందంటూ నెటిజన్లు లెక్కలు కడుతున్నారు. అయితే ఇది కేవలం అభిమానుల ఊహాగానం మాత్రమేనా లేక నిజంగానే ఆ రోజున పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సెన్సేషనల్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంగీతం సమకూరుస్తున్నారు. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో అల్లు అర్జున్ కనిపించనుండటంతో ‘రాకా’పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Exit mobile version