విడుదల తేదీ : సెప్టెంబర్ 18, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : నిహాల్ కొదాటి, సూర్య శ్రీనివాస్, కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్, దీక్షా పంత్ తదితరులు.
దర్శకత్వం : అక్కి విశ్వనాథ్ రెడ్డి
నిర్మాత : అక్కి విశ్వనాథ్ రెడ్డి
సంగీతం : కార్తీక్ రోడ్రిగ్జ్
ఛాయాగ్రహణం : సురేశ్ ఆర్
కూర్పు : మార్తాండ కె వెంకటేష్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. అక్కి విశ్వనాథ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
భారతదేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన రహస్య సమాచారం లీక్ అవుతుంది. మరోవైపు నెల్లూరులో సాధారణ జీవితం గడిపే ఇద్దరు యువకులు వలి (నిహాల్ కొదాటి), పృథ్వీ (సూర్య శ్రీనివాస్). పైగా ఈ ఇద్దరు మంచి స్నేహితులు. ప్రాక్టికల్ గా ఉండే పృథ్వీకి ఎమోషనల్ పర్సన్ గా ఉండే వలి అంటే ఇష్టం. ఐతే, ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో వలి దేశ ద్రోహి అంటూ అనేక అవమానాలు పడాల్సి వస్తోంది. కానీ, వలికి ఇండియా అంటే ప్రాణం. దేశం కోసం ప్రాణం అయినా ఇవ్వాలని తపన పడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో దేశానికి జరగబోయే ఓ ప్రమాదకరమైన కుట్రను వలి ఎలా అడ్డుకున్నాడు ?, అసలు దేశద్రోహ శక్తులను వలి ఎలా ఎదుర్కొన్నాడు ?, ఈ మధ్యలో వలి ఏమైపోయాడు ?, వలి గురించి నిజం తెలిసిన పృథ్వీ చివరకు ఏం సాధించాడు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
స్నేహం, దేశభక్తి మరియు గూఢచర్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెయిన్ పాయింట్ బాగుంది. ప్రధానంగా చర్చించిన స్నేహానికి సంబధించిన అంశం..అలాగే ‘దేశం కోసం కొంతమంది ఎలాంటి త్యాగం చేస్తారు ?, ప్రాణం ఇచ్చి అయినా సరే దేశాన్ని ఎలా కాపాడతారనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందించడం కూడా బాగుంది. ఇక నిహాల్ కొదాటి తన పాత్రలో బాగా నటించాడు. దేశం మీద అతనికున్న ప్రేమను తన హావభావాల్లో బాగా పలికించాడు. సూర్య శ్రీనివాస్ కూడా తన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు.
ఇక కమల్ కామరాజు కూడా తన పాత్రలో ఎప్పటిలాగే చాలా బాగా నటిస్తూ ఉన్నంతసేపు ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. కీలక పాత్రల్లో నటించిన రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా బాగానే చేశారు. అలాగే రా వ్యవస్థలో జరిగే కొన్ని సంఘటనలను విశ్లేషాత్మకంగా చూపించే ప్రయత్నం చేయడం బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్:
ఈ ‘సీక్రెట్ సోల్జర్’ సినిమాలో ఇంట్రెస్టింగ్ డ్రామా ఉన్నా.. చాలా చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్ గా సాగాయి. ఫస్ట్ హాఫ్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. దీనికితోడు, అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా ఈ సినిమా స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది. సినిమా మొత్తం దేశ ద్రోహం చుట్టే తిరిగింది కాబట్టి, ఆ డ్రామాను ఇంకా బలంగా డిటైల్డ్ గా ఎస్టాబ్లిష్ చేసి కన్వెన్స్ చేయాల్సింది.
మొత్తానికి ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ ఆకట్టుకోవు. ఇక సెకండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి బాగానే ప్రయత్నం చేశాడు, కాకపోతే పూర్తి స్థాయిలో ఎక్కడా ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు. పైగా సిల్లీ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో సినిమాని సాగదీశారు. మొత్తమ్మీద ఈ సీక్రెట్ సోల్జర్ మూవీ మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. కొన్ని సీన్స్ విషయంలో బాగాలేదు. అలాగే, క్లైమాక్స్ లోని సీన్స్ కూడా ఆకట్టుకోవు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కెమెరామెన్ సురేశ్ ఆర్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆ ఫీల్ ను తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించాడు. అలాగే ఎడిటింగ్ కూడా బావుంది. సంగీతం పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా బాగుంటే కథకు ప్లస్ అయ్యేది. ఇక దర్శకుడు మంచి కథాంశం తీసుకున్నా.. ఆ కథాంశానికి తగ్గట్లు ఉత్కంఠభరితమైన కథనాన్ని మాత్రం రాసుకోలేకపోయాడు. ఆయన స్క్రిప్ట్ మీద ఇంకా బాగా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా బెటర్ గా ఉండేది.
తీర్పు :
‘సీక్రెట్ సోల్జర్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ క్రైమ్ డ్రామాలో.. స్నేహం, దేశభక్తి వంటి అంశాలను బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. కథలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను కూడా దర్శకుడు బాగానే ప్లాన్ చేశాడు. కానీ.. స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, కొన్ని కీలక సన్నివేశాల్లో లాజిక్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team
