వర్సటైల్ నటుడు సత్యదేవ్ హీరోగా, అజయ్ నాగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సమవర్తి’. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ తాజాగా రిలీజ్వి చేశారు మేకర్స్. ఒక పవర్ఫుల్ ఎకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో సత్యదేవ్ ఫారెస్ట్ గార్డ్‌గా కనిపిస్తున్నాడు.
మునుపెన్నడూ లేని విధంగా రగ్గడ్ అండ్ మాస్ లుక్‌లో పవర్ ఫుల్ మేకోవర్‌తో సత్యదేవ్ చెప్పే పవర్ డైలాగ్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టీజర్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ మరియు ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని రుద్ర పిక్చర్స్ మరియు పంచభూత ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి.
టీజర్ కట్ చూసిన సినీ ప్రియులు సత్యదేవ్ ఖాతాలో మరొక సాలిడ్ హిట్ పడటం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
