మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ..?

Chiranjeevi

నైజాం ప్రాంతంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత మరియు ఫైనాన్షియర్‌గా పేరొందిన ఏషియన్ సునీల్, టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి అత్యంత విలాసవంతమైన మల్టీప్లెక్స్‌లను నిర్మించడంలో దిట్ట. ఇదివరకే ఆయన మహేష్ బాబుతో కలిసి ‘AMB’, అల్లు అర్జున్‌తో ‘AAA’, రవితేజతో ‘ART’, మరియు విజయ్ దేవరకొండతో ‘AVD’ మల్టీప్లెక్స్‌లను విజయవంతంగా నిర్మించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో ఏషియన్ సునీల్ చేతులు కలపడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి తన కెరీర్‌లో మొదటిసారిగా మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతుండటం విశేషం. హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఈ మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేయడానికి స్థలాన్ని ఖరారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన అనుమతుల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ అందించే ఈ థియేటర్‌లో ఒక ‘ఐమాక్స్’ స్క్రీన్ కూడా ఉండబోతోందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

సునీల్ నారంగ్ కుటుంబంతో దశాబ్దాలుగా మంచి అనుబంధం ఉన్న చిరంజీవి, వారు అందిస్తున్న క్వాలిటీ అండ్ బిజినెస్ మోడల్ పట్ల ఆకర్షితులై ఈ పెట్టుబడికి ముందుకొచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి

Exit mobile version