టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు దర్శకుడు కొల్లి బాబీ కలయికలో చేస్తున్న సాలిడ్ చిత్రం కాకా కోసం అందరికీ తెలిసిందే. జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన టైటిల్ గ్లింప్స్ మంచి ఆదరణ అందుకుంది.
అయితే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి ముందే చిరు ‘కదిరి’ అంటూ చిన్న లీక్ ఇవ్వడం వైరల్ గా మారింది. కానీ తర్వాత మేకర్స్ కాకా అని సింపుల్ టైటిల్ రివీల్ చేశారు. అయితే లేటెస్ట్ గా కాకా వెనుక ఉన్న అసలు అర్ధాన్ని మరోసారి చిరు లీక్ చేశారు.
లేటెస్ట్ గా ఓ ఈవెంట్ లో పాల్గొన్న మెగాస్టార్ కాకా అంటే ‘కదిరి కాళిదాస్’ అంటూ అసలు విషయం చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది. అలాగే దీనిని మేకర్స్ కూడా షేర్ చేయడం విశేషం. అంతే కాకుండా సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఇప్పటికీ జనవరి 13 అనే ప్రచారం కూడా చేస్తున్నారు. సో ఇలా వచ్చే ఏడాది సంక్రాంతికి కదిరి కాళిదాస్ రచ్చ చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.
కాకా… కదిరి కాళిదాస్ ❤️🔥❤️🔥❤️🔥#KAAKA – JAN 13th Sankranthi 2027🔥#KAAKAOnJan13 pic.twitter.com/tfaa5Nmadk
— Kaaka (@KaakaMovie) September 20, 2026
