‘రాకా’ ట్రీట్ తో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డీవోయిక6హీరోయిన్ గా యంగ్ దర్శకుడు అట్లీ కలయికలో చేస్తున్న భారీ విజువల్ ట్రీట్ నే రాకా. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను అట్లీ క్రేజీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నాడు. అయితే నిన్న అట్లీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకి 37 మంది మోకాప్ ఆర్టిస్ట్ లు పని చేసారని గిన్నిస్ రికార్డ్ వచ్చినట్లు తెలిపారు.

ఇది గొప్ప విషయమే కానీ.. అభిమానులు అంతకు మించి ఆశించారు. సినిమా గ్లింప్స్ లాంటిది వస్తుంది అని భావించిన అందరికీ ఒకింత ఇది డిజప్పాయింట్ చేసింది. ఇక ఆ తర్వాత ఓ మేకింగ్ వీడియో కూడా వదిలారు. మొత్తం 4 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోలో కనీసం ఆఖరులో అయినా అసలు వీరేం ప్లాన్ చేస్తున్నారు అనేది విజువల్ గా అవుట్ పుట్ ని చూపించాల్సింది అని భావించారు. కానీ అలాంటిది కూడా ఏమీ లేకుండానే ముగించారు. దీనితో ఫ్యాన్స్ మాత్రం ఒకింత డిజప్పాయింట్ అయ్యారనే చెప్పక తప్పదు.

Exit mobile version