యూఎస్ మార్కెట్ లో జడల్ గాని ర్యాంపేజ్..!

నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ చిత్రమే ది ప్యారడైజ్. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా విడుదల ఇప్పుడు మరింత చేరువ అయ్యింది. అయితే ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి ఓపెనింగ్స్ పై కన్నేయగా నార్త్ అమెరికాలో సినిమా ర్యాంపేజ్ చూపిస్తుంది.

లేటెస్ట్ గా ఈ సినిమా 7 లక్షల 50 వేల డాలర్స్ గ్రాస్ మార్క్ ని దాటేసి 1 మిలియన్ ఓపెనింగ్స్ దిశగా దూసుకెళ్తుంది. దీనితో జడల్ గాని మ్యానియా గట్టిగా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. మోహన్ బాబు, రాఘవ్ జుయల్ అలాగే సోనాలి కులకర్ణి లాంటి పవర్ హౌస్ నటీనటులు ఇందులో నటించారు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించిన ఈ సినిమా గ్రాండ్ గా సెప్టెంబర్ 23 సాయంత్రం ప్రీమియర్ షోస్ తోనే మొదలు కానుంది.

Exit mobile version