టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీని వైట్ల కలయికలో చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం ‘జార్జ్ క్రిష్’ కోసం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తూ ఈ సినిమాని మేకర్స్ ఆన్ టైం తీసుకొచ్చే ప్లానింగ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా మేకర్స్ ఓ అప్డేట్ ని అందించారు. జార్జ్ క్రిష్ ఫస్ట్ బూస్టర్ అంటూ ఈ సెప్టెంబర్ 24న విడుదల చేస్తున్నట్టుగా డేట్ ని అనౌన్స్ చేశారు.
బహుశా ఈ సినిమా తాలూకా ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేస్తున్నారు కావచ్చు. లేదా పోస్టర్ బట్టి కూడా చూస్తే సినిమా ఫస్ట్ సింగిల్ కూడా కావచ్చు. సో అదేంటో తెలియాలి అంటూ ఈ రెండు రోజులు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నారు.
