నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమానే ది ప్యారడైజ్. భారీ అంచనాలు నడుమ నిన్న ప్రీమియర్స్ తో నేడు ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ తో రాబోతుంది. అయితే నాని సినిమాలు గత కొన్నాళ్లుగా ఏదొక ఇబ్బందితోనే విడుదల అయ్యాయి. కోవిడ్ నుంచి జోరు వానలు ఇలా ఏదొకటి ఎఫెక్ట్ చేస్తూ వచ్చింది.
ఇప్పుడు కూడా ప్యారడైజ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కారణంగా ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. అంతే కాకుండా నైజాం మార్కెట్ లో హైదరాబాద్ లో బాగా ఎఫెక్ట్ పడనుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ గణేష్ నిమర్జనాలు కారణంగా ఇది చాలా ఎఫెక్ట్ చేయనుంది.
దాదాపు సిటీ అంతా ఈ పనుల్లోనే ఉంటారు కావున డే 2 ప్యారడైజ్ వసూళ్లులో బాగా ప్రభావం పడనుంది. దీనితో నాని సినిమాకి మాత్రం వరుస ఇబ్బందులు తప్పడం లేదని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించారు.
