‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్: టైటిల్ కి తగ్గట్టుగానే మంచి ఫన్ తో ప్రెజెంట్ చేసారుగా!

టాలీవుడ్ యువ హీరో చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన రీసెంట్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్ అయ్యాయి. ఇక ఈ చిత్రాల తర్వాత శర్వానంద్ నుంచి రానున్న మరో సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే ‘జార్జ్ క్రిష్’. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ నేడు శ్రీను వైట్ల పుట్టినరోజు కానుకగా ఫస్ట్ బూస్టర్ అంటూ సినిమా తాలుకా చిన్న గ్లింప్స్ ని వదిలారు.

అయితే ఈ గ్లింప్స్ మాత్రం టైటిల్ కి తగ్గట్టుగానే పర్ఫెక్ట్ గా కట్ చేసారని చెప్పాలి. ఒక పక్క జార్జ్ గా మరోపక్క క్రిష్ గా రెండు షేడ్స్ లోనూ శర్వానంద్ ని ప్రెజెంట్ చేసి తనపై మంచి ఫన్ జెనరేట్ చేసేలా కనిపిస్తున్నారు. ఇక స్మార్ట్ లుక్స్ లో శర్వానంద్ ఆకట్టుకుంటే యంగ్ హీరోయిన్ మానస వారణాసి కూడా ఇందులో బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది.

వి ఎఫ్ ఎక్స్ షాట్స్ మాత్రం క్లియర్ గా తెలిసిపోతున్నాయి. వీటిని సరి చేసుకోవాలి. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని అనీల్ సుంకర నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నారు.

 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version