‘కాకా’ ఫిక్స్.. అయినా తగ్గనంటున్న ‘సంబరాల ఏటి గట్టు’..?

సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సంక్రాంతి కానుకగా ఖచ్చితంగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దీంతో సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ విషయంలో తమ నిర్ణయం మార్చుకుంటారని అందరూ భావించారు. కానీ, ఈ చిత్రం కూడా సంక్రాంతి కానుకగా ముందుగా అనౌన్స్ చేసిన తేదీనే రానుందని నిర్మాత చైతన్య రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తామే ముందుగా డేట్ ప్రకటించామని, షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్నందున సంక్రాంతి రేసు నుండి తప్పుకునేదే లేదని తేల్చి చెప్పారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Exit mobile version