గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సమర్పణలో వస్తున్న లేటెస్ట్ సినిమానే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. టాలెంటెడ్ నటుడు ఫహాద్ ఫాజిల్ హీరోగా దర్శకుడు శశాంక్ యేలేటి తెరకెక్కించిన మ్యాజికల్ ఎంటర్టైనర్ చిత్రమే ఇది. ట్రైలర్ తో మంచి బజ్ రేకెత్తించిన ఈ సినిమాని మేకర్స్ తెలుగుతో పాటుగా తమిళ్ లో కూడా విడుదల చేయబోతున్నారు. అలా తమిళనాట ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయగా అక్కడ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా స్టార్ హీరో సూర్య హాజరు కావడం జరిగింది.
అయితే ఈ ఈవెంట్లో సూర్యతో సినిమాపై జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. తను ఈ ప్రశ్నకి ప్రిపేర్డ్ గానే వచ్చానని, ఇప్పుడు మనం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కోసం వచ్చాము కానీ ఈ సమయంలో మా కాంబినేషన్ కోసం మాట్లాడితే డోంట్ ట్రబుల్ పక్క దారి పడుతుంది. కానీ మా కాంబినేషన్లో ఎప్పుడు సినిమా వచ్చినా అది ఖచ్చితంగా చాలా స్పెషల్ గానే ఉంటుంది అని ఓ పాజిటివ్ సమాధానంతో ముగించడం వైరల్ గా మారింది.
