సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘రోమాంచకం’, నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. నూతన దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, అనంతిక అనిల్‌కుమార్ జంటగా నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 1, 2026న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని సంస్థ ధృవీకరించింది.
విశేషమేమిటంటే, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది, దీనివల్ల తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితం కాకుండా వివిధ భాషా ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చేరువయ్యే అవకాశం ఉంది. థియేటర్లలో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడనప్పటికీ, ఓటీటీ విడుదల ‘రోమాంచకం’కు కొత్త ఊపిరిని పోయవచ్చు.
కాగా నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ చిత్రం మరింత మంది ప్రేక్షకులకు చేరుతుండటంతో, ఈ డిజిటల్ విడుదల అయినా సినిమాపై ఉన్న అభిప్రాయాలను మారుస్తుందేమో చూడాలి. ఈ సినిమాకి వాసుకి వైభవ్ సంగీతం అందించారు.
