విడుదల తేదీ : 13 సెప్టెంబర్ 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5 |
||
దర్శకుడు : అడివి శేష్ |
||
నిర్మాత : అడివి సాయికిరణ్ |
||
సంగీతం : శ్రీ చరణ్ పాకా, పేటె వండర్ |
||
నటీనటులు : అడివి శేష్, ప్రియ బెనర్జీ |
అడివి శేష్, ప్రియ బెనర్జీ హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా ‘కిస్’. అడివి శేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని అడివి సాయికిరణ్ నిర్మించాడు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ :
ప్రియ (ప్రియ బెనర్జీ) సాన్ ఫ్రాన్సిస్కో లో జీవిస్తున్న తెలుగు అమ్మాయి. ఆమె నాన్న చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ కాస్త సాంప్రదాయాలను నమ్మే వ్యక్తి. అందువల్ల ప్రియకి పూర్తి ఫ్రీడం ఇవ్వకుండా చాలా నిబందనలు విదిస్తాడు. దానితో ఆమె చాలా అసంతృప్తిగా వుంటుంది. తన భావాలను పైకి చెప్పలేకపోతూ వుంటుంది. ఇంతలో ఆమె తండ్రి తనకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తను అనుకున్నది సాదించాలనుకునే రవి(భరత్ రెడ్డి)ను పిలిపిస్తాడు. దీనితో ప్రియ దైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది.
ఆమె ఇంటి నుండి పారిపోయి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. కానీ సన్నీ(అడివి శేష్) చాలా కష్టపడి తనని కాపాడుతాడు. సన్నీ చాలా సరదాగా ఉండే యంగ్ బాయ్. యుఎస్ఏ లో తన చేసిన ప్రయత్నాలు విపలం కావడంతో హైదరాబాద్ కు వెళ్దామని అనుకుంటూ వుంటాడు. అతను ప్రియను సంతోషంగా బ్రతకమని కన్విన్స్ చేస్తాడు. ఇద్దరు కలిసి సాన్ ఫ్రాన్సిస్కో మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ వుంటారు. అదే తరుణంలో ప్రియ తల్లిదండ్రులు తప్పిపోయిన కూతురు కోసం వెతుకుతూ వుంటారు.
ఇలా వీరిద్దరూ సిటీ అంతా తిరుగుతూ ఉండగా వారికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ప్రేమలో పడతారు. వారిద్దరూ మద్య రొమాంటిక్ ట్రాక్ మొదలవుతుంది. ఆ సమయంలో ప్రియ ఏం చేసింది? ఆమె తన తండ్రిపై వున్న గౌరవంతో ఇంటికి వెళ్తుందా? లేక సన్నీని పెళ్లి చేసుకుంటుందా? తెలియాలంటే ‘కిస్’ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాతో ప్రియ బెనర్జీ కి మంచి పేరు వస్తుంది. ఆమె హావ బావలను పలికించే విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే మంచి నటి అయ్యే అవకాశం ఉంది. ప్రియ బెనర్జీ బాబ్లీ గర్ల్ పాత్రలో పూర్తి ఎనర్జీతో చాలా బాగా నటించింది. అడవి శేష్ కొన్ని సన్నివేశాలలో చూడటానికి అందంగా వున్నాడు. షఫీ పరవాలేదు. ఈ సినిమాలో వచ్చే ఒకటి రెండు రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. ఈ సినిమాలో సాన్ ఫ్రాన్సిస్కో ని చాలా అందంగా చూపించడం జరిగింది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కాస్త నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఆ ఫీల్ ఎక్కువగా ఉంటుంది. సినిమాని చూస్తుంటే లాగి లాగి సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా ఎడిటర్ సినిమాలో చివరి 20 నిమిషాలలో కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసివుంటే బాగుండేది.స్క్రీన్ ప్లే బాగాలేదు. కొన్నిసన్నివేశాలలో అయితే నటీనటుల పెర్ఫార్మెన్స్ చాలా దారుణంగా వుంది. ఈ సినిమాలో ప్రియ తల్లిగా నటించిన లేడి యాక్టర్ నటన చిరాకు తెప్పిస్తుంది. సినిమాలో ప్రియ మామయ్యగా ఎటువంటి సమాచారం లేకపోయినా ఆమె కోసం వెతుకుతూ వుంటాడు.
సినిమాలో ఒక వ్యక్తి మహేష్ బాబును అనుకరించే సన్నివేశాలు, చెప్పే డైలాగులు చాలా చిరాకు తెప్పిస్తాయి. భరత్ రెడ్డి పాత్రకి పెద్దగా ప్రాదాన్యం లేదు, ఆ పాత్ర వల్ల సినిమాకి ఎలాంటి ఉపయోగం లేదు. సినిమా చూస్తుంటే ఇంకా చూడాలి అనే రాదు. ఈ సినిమాలో రొమాంటిక్ కామెడీ, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, చమత్కారమైన మాటలు సినిమాలో కచ్చితంగా ఉంది తీరాలి కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే అవన్నీ ఇందులో మిస్ అయ్యాయి. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ పెద్ద గుండు సునా అని చెప్పుకోవాలి.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ ప్రకారం చూస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇంతకు ముందు చెప్పినట్లు సినిమాలో సాన్ ఫ్రాన్సిస్కో ని చాలా అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డీసెంట్ గా వుంది. కానీ కొన్ని సమయాల్లో చిత్రీకరించిన ఎమోషనల్ సన్నివేశాలు అంతగా సినిమాపై ప్రభావాన్ని చూపలేదు. ఎడిటింగ్ బాగాలేదు. అడివి శేష్ డీసెంట్ నటుడు. కానీ డైరెక్టర్ గా మంచి పేరుని మాత్రం సాదించలేకపోయాడు. తను ఈ సినిమాని అనుభవం లేనివాడిలాగా తీయడం జరిగింది.
తీర్పు :
పాత కథాంశంతో నెమ్మదిగా సాగే ఒక రొమాంటిక్ కామెడీ మూవీ ‘కిస్’. ఆకట్టుకొని నటీనటుల పెర్ఫార్మన్స్, స్క్రీన్ ప్లే కూడా పూర్ గా వుండటంతో సినిమా చూడలనిపించదు. ప్రియ బెనర్జీ మాత్రమే ఈ సినిమాకి ప్లస్. మల్టీప్లెక్ష్స్ వారిని వదిలేస్తే మిగిలిన వారు ఈ సినిమాని చూడటానికి పెద్దగా ఇష్టపడరు. ఈ సినిమాని వారు పరిగణలోకి తీసుకోకపోవచ్చు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
రివ్యూ : మహేష్ ఎస్ కోనేరు
అనువాదం : నగేష్ మేకల