‘ఓ మై గాడ్ రీమేక్’ లో రాధిక ఆప్టే.?

radhika-apte
విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ రీమేక్ లో నటించనున్నారు. ఈ సినిమాలో మొదటగా వెంకటేష్ సరసన నయనతారని అనుకున్నారు. కానీ నయనతార ఈ సినిమాని నుంచి తప్పుకుంది. దాంతో ప్రస్తుతం ఆ పాత్రకి ఇటీవలే విడుదలైన ‘లెజెండ్’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న రాధిక ఆప్టేని పరిశీలిస్తున్నారు.

కానీ వెంకీ సరసన రాధిక ఆప్టే నటించనుంది అనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం వెంకటేష్ ‘దృశ్యం’ రీమేక్ లో బిజీగా ఉంటే, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ ఫ్రీ అయ్యాక జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని డి.సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మించనున్నారు. ‘తడాఖా’ ఫేం డాలీ ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఉంది.

Exit mobile version