దీపావళికి విడుదలకానున్న మనోహరుడు?

Manoharudu
తాజా సమాచారం ప్రకారం విక్రమ్ మరియు శంకర్ ల కలయికలో వస్తున్న ‘ఐ’ సినిమా ఈ దీపావళికి విడుదలకానుంది. ఆస్కార్ రవిచంద్రన్ ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని పంపిణీదారులకు చెప్పినట్టు సమాచారం. గ్రాఫిక్స్ మరియు ప్రొడక్షన్ పనుల జాప్యం కారణంగా సినిమా ఆలస్యమయిందని సమాచారం

‘ఐ’ సినిమా తెలుగులో మనోహరుడు గా విడుదలకానుంది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతదర్శకుడు. విక్రమ్ ఈ సినిమాలో పలు విభిన్న గెట్ అప్ లతో మనల్ని అలరించనున్నాడు. న్యూజిలాండ్ కి చెందిన గ్రాఫిక్స్ మరియు మేక్ అప్ సంస్థలను తెప్పించినట్టు సమాచారం

అమీ జాక్సన్ ఈ సినిమాలో హీరోయిన్. పి.సి శ్రీరాం కెమెరామెన్

Exit mobile version