‘ఎర్రబస్సు 2 ఎయిర్ బస్’ దాసరి ఆత్మకథ విశేషాలు.

Dasari-narayana

ఇది సోషల్ మీడియా రాజ్యమేలుతున్న కాలం. ఈ ఇంటర్నెట్ యుగంలో టెక్నాలజీని ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సినిమా ప్రముఖులు. తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం, సినిమాపై అభిమానుల అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం ఎక్కువగా సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. అటువంటి ప్రముఖులకు భిన్నంగా దర్శకరత్న దాసరి నారాయణరావు సోషల్ మీడియాలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.

తన జీవిత చరిత్రను భాగాలుగా విభజించి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. 69 ఏళ్ళ క్రితం పాలకొల్లులో దాసరి సాయి రాజు, మహా లక్ష్మి దంపతులకు జన్మించిన ఆరవ సంతానం మన దాసరి. ఈయన దర్శకరత్నగా ఎలా ఎదిగారు..? అనే అంశంతో పాటు తన జీవితంలో జరిగిన మజిలీలను, మలుపులను వివరిస్తూ ఓ పుస్తకం రాయనున్నారు. ‘ఎర్రబస్సు 2 ఎయిర్ బస్’ అనే పేరుతో పుస్తకంలో అంశాలను పేస్ బుక్ లో షేర్ చేస్తున్నారు. వీటికి అద్బుత స్పందన లభిస్తుంది. 150 సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత దాసరి సొంతం. దర్శకుడిగా, నాయకుడిగా, మంచి వ్యక్తిగా ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. దాసరి ఆత్మకథ చదివి భావితరాలు ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఆత్మకథ పుస్తక రూపంలో రావడానికి చాలా రోజులు పట్టే అవకాశం ఉంది.

ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ఎర్రబస్సు’ నిర్మాణంతార కార్యక్రమాలలో తలమునకలై ఉండడం వలన ఆత్మకథ రచనకు స్వల్ప విరామం ఇచ్చారు. నవంబర్ 14న సినిమా విడుదల తర్వాత తిరిగి ఆత్మకథ రాయడం మొదలుపెడతారు.

దాసరి నారాయణ రావు అఫీషియల్ పేస్ బుక్ పేజి లింక్ : https://www.facebook.com/DNR

Exit mobile version