నిరాహారదీక్ష చేయనున్న ఏఆర్ రహమాన్ !

A-R-rehaman
జల్లికట్టు వివాదం గంట గంటకు తీవ్ర రూపం దాల్చుతున్న తరుణంలో ఆ నిరసనకు సినీ సెలబ్రిటీల మద్దత్తు కూడా ఎక్కువవుతోంది. ఇప్పటికే శింబు, అజిత్, శివకార్తికేయన్ వంటి ఎందరో స్టార్ హీరోలు నిరసనలతో పాల్గొంటుండగా ఇప్పడు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ కూడా జల్లికట్టుకు మద్దతుగా నిరాహార దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. దీంతో జల్లికట్టు నిరసనకారులు, వారిని సపోర్ట్ చేస్తున్న సినీ నటీనటులు, దర్శకులు, ఇతరులకు మంచి బలం చేకూరినట్టైంది.

ఈ నిరాహారదీక్ష రేపు జరగనుంది. ఇలా రాహ్స్త్ర స్థాయి నుండి జాతీయ స్థాయి ప్రముఖుల వరకు అందరు తమిళ సంస్కృతిని కాపాడాలంటూ సామాన్యు జనం, విద్యార్థులతో కలిసి కేంద్రంపై ఒత్తడి తీసుకొస్తున్నారు. ఈ నిరసనలో ప్రజలకు మద్దతుగా రాజకీయ నాయకులకన్నా సినీ రంగ ప్రముఖులే నిలవడం విశేషంగా చెప్పుకోవాలి. పైగా ఈరోజు మొత్తం తమిళనాట సినీ రంగానికి సంబందించిన ఎలాంటి పనులూ జరగలేదు. అందరూ స్వచ్ఛందంగా నిరసనకు సహకరిస్తున్నారు.

Exit mobile version