మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ భారీ అంచనాలు మధ్య నిన్న విడుదలైయింది. ఇక ఈ చిత్రానికి రివ్యూస్ తో పాటు టాక్ కూడా నెగిటివ్ గానే వచ్చింది. అయితే ఆ ఎఫెక్ట్ కలెక్షన్ల ఫై మాత్రం పడలేదు. ఊహించని విధంగా తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 26 కోట్ల షేర్ ను రాబట్టి షాక్ ఇచ్చింది. అలాగే టాలీవుడ్ లో బాహుబలి , అజ్ఞాతవాసి చిత్రాల తరువాత బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది.
అంతే కాకుండా సీడెడ్ లో బాహుబలి 2రికార్డు ను బద్దలుకొట్టింది. అక్కడ బాహుబలి2 రూ. 6కోట్ల షేర్ రాబట్టగా ఈచిత్రం రూ.7.20కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈచిత్రానికి పండుగ సెలవుల రూపంలో కలిసిరానుంది. మరి రానున్న రోజుల్లో బాక్సాఫిస్ వద్ద ఇదే జోరును కొనసాగిస్తుందో లేదో చూడాలి.
తెలంగాణ &ఏపీలో మొదటి రోజు ఏరియాల వారిగా కలెక్షన్ల వివరాలు
ఏరియా | కలక్షన్స్ |
నైజాం | 5.08 కోట్లు |
సీడెడ్ | 7.20 కోట్లు |
నెల్లూరు | 1.6 9కోట్లు |
గుంటూరు | 4.18 కోట్లు |
కృష్ణా | 1.59కోట్లు |
పశ్చిమ గోదావరి | 1. 83 కోట్లు |
తూర్పు గోదావరి | 2.05 కోట్లు |
ఉత్తరాంధ్ర | 2.45కోట్లు |
ఏపీ, తెలంగాణ మొదటి రోజు షేర్ | 26.07 కోట్లు |